ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిని బుధవారం అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్ 959బి లో 2. 31 ఎకరాలను కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినట్లుగా తహశీల్దార్ చిరంజీవి తెలిపారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి సర్వే నిర్వహించిన అనంతరం ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లుగా చిరంజీవి చెప్పారు.