కోల్డ్ స్టోరేజ్ నుండి కింద పడి ప్లంబర్ నరసింహారావు మృతి

2953చూసినవారు
కోల్డ్ స్టోరేజ్ నుండి కింద పడి ప్లంబర్ నరసింహారావు మృతి
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న కోల్డ్ స్టోరేజ్ భవనం నుండి ప్రమాదవశాత్తు కిందపడి ప్లంబర్ పెరుమళ్ళ నరసింహారావు సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మార్కాపురం రూరల్ ఎస్సై వెంకటేశ్వరా నాయక్ సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్కాపురం ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్