ప్రకాశం జిల్లా తర్లపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎస్సై బ్రహ్మనాయుడు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలని ఈ వ్యక్తిగత వివరాలు అడుగుతారని అలానే ప్రభుత్వ పథకాల పేరిట కూడా సైబర్ నేరగాళ్లు వలవేస్తారని తెలిపారు. అటువంటివారిని సైబర్ నేరగాళ్లగా గుర్తించి జాగ్రత్త వహించాలన్నారు. ఈ విషయాలను మీ తల్లిదండ్రులకు తెలపాలన్నారు.