ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

554చూసినవారు
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
ఒంగోలులోని ప్రకాశం భవనంలోని స్పందన హాలులో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మంగళవారం ఉగాది వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్