పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్ లో ఆమె అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు. జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అనుమతుల కోసం వచ్చిన 565 దరఖాస్తులలో 499 ఆమోదం పొందాయని తెలిపారు.