ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ దామోదర్ మహనీయుల చిత్రపటానులకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యం, అహింసలే ఆయుధాలుగా గాంధీజీ భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో నూతన అధ్యయనానికి నాంది పలికారన్నారు.