చంద్రబాబు చూపు దామచర్ల వైపేనా?

69చూసినవారు
చంద్రబాబు చూపు దామచర్ల వైపేనా?
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రాజకీయ వారసుడిగా వచ్చిన జనార్ధన్ టిడిపి కష్టకాలంలో దశాబ్దం పాటు జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి సేవలందించారు. అలాగే ఒంగోలులో మహానాడు, యువ గళం కార్యక్రమాలు విజయవంతం అవ్వటానికి, అభ్యర్థుల గెలుపునకు తెరవెనుక కీలక పాత్ర పోషించాడు. దీంతో ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమనే చర్చ నడుస్తుంది.

సంబంధిత పోస్ట్