జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుతున్న 10, ఇంటర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం భవన్ లో శుక్రవారం హాస్టల్ వార్డెన్ లకు ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అదనపు శిక్షణ ఇప్పించి ప్రతి విద్యార్థికి మంచి మార్కులు తీసుకురావాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.