ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ జనాభా వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కలెక్టరేట్ లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగనన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నామన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 31వ తేదీ లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాలని తెలిపారు.