జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా జపనీస్ భాషపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం పలు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న డిమాండ్ కు అనుగుణంగా కోర్సులపై శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.