టిడిపి అభ్యర్థులను గెలిపించండి: దేవినేని ఉమా

70చూసినవారు
టిడిపి అభ్యర్థులను గెలిపించండి: దేవినేని ఉమా
రానున్న ఎన్నికల్లో టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి ఆ పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. ఒంగోలు నగరంలోని 46, 47, 48, 49వ డివిజన్లలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కార్యక్రమంలో బిజెపి నేత యోగయ్య యాదవ్, జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్, ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్