Oct 22, 2024, 07:10 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి: కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
Oct 22, 2024, 07:10 IST
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టీఎన్టీయూసీ ప్రధానకార్యదర్శి మణిరాంసింగ్ మంగళవారం పేర్కొన్నారు. బెల్లంపల్లిలోని టీఎన్టీయూసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంలో కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.