కేసీఆర్ జీడీపీ పెంచితే.. రేవంత్ గుండాయిజం పెంచుతుండు: హరీశ్ రావు

58చూసినవారు
కేసీఆర్ జీడీపీ పెంచితే.. రేవంత్ గుండాయిజం పెంచుతుండు: హరీశ్ రావు
తెలంగాణ జీడీపీని కేసీఆర్ పెంచితే, రేవంత్ గుండాయిజం పెంచుతున్నాడని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. 'వానాకాలం రైతు బంధు రూ. 8 వేలు ఎగ్గొట్టిండు, యాసంగిలో రూ. 4 వేల కోట్లు ఎగ్గొట్టిండు. ఈ రెండు కలిపి రుణమాఫీకి జమచేసి, రుణమాఫీ అయిపోయింది అంటున్నడు. కరోనా వచ్చినా కూడా కేసీఆర్ రైతుబంధు, పింఛన్ ఆపలేదు. రేవంత్ రెడ్డికి ఏమైంది.. కరోనా లేదు, ఇబ్బంది లేదు, రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు?' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్