రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి - డా. దేవర యాదిద్య

80చూసినవారు
రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి - డా. దేవర యాదిద్య
ఈ నెల 12వ తేదీన ఎర్రగొండపాలెం ఏరియా వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ దేవర యాదిద్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సమయంలో ఎంతో మంది రక్తం అందక చనిపోతున్నారన్నారు. వారి కోసం 12న రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కావున యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు. ముందుగా వారి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్