పెద్దారవీడు: గుండం చర్లలో వివాదాస్పద సంఘటన

50చూసినవారు
పెద్దారవీడు: గుండం చర్లలో వివాదాస్పద సంఘటన
పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. పశువులను మేత కోసం తీసుకువచ్చిన సందర్భంలో అటవీశాఖ అధికారులు తమపై దాడి చేశారని పశువుల కారపర్లు ఆరోపించారు. పశువుల కాపరి వెంకటేశ్వర్లు అటవీశాఖ అధికారులు కొట్టడంతో గాయాలయాయని మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఇదిలా ఉంటే అటవీశాఖ అధికారులు తమపైనే పశువుల కాపర్లు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్