యర్రగొండపాలెం: పోలీసులపై అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

79చూసినవారు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కేసులు పెడుతున్నారని పోలీసులు ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో పేర్కొన్నారు. వేధింపులపై దృష్టి పెట్టకుండా కార్యకర్తలపై దృష్టి పెట్టాలని ప్రతిపక్ష పార్టీలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్