త్రిపురాంతకం: గ్రంథాలయ ఉద్యమకారులకు ఘన నివాళులు
త్రిపురాంతకంలోని గ్రంధాలయంలో గ్రంధపాలకుడు రామాంజి నాయక్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మూడవ రోజు గ్రంథాలయ ఉద్యమకారులు అయ్యంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం, ఎస్ ఆర్ రంగనాధన్ లకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఈపీఆర్డీఓ రామ సుబ్బయ్య విద్యార్థిని, విద్యార్థులకు చక్కని జీవిత విశేషాలను వివరించారు. అనంతరం విద్యార్థులకు దేశభక్తి, జానపద గేయాలు మీద పాటల పోటీలు నిర్వహించారు.