3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

73చూసినవారు
3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు
AP: రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడటంతో పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5, విజయనగరం జిల్లా బాడంగిలో 44.5, ఇద్దనవలసలో 42, ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలో 44.2 మి.మీ. వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్