పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి బైక్ నడపడంతో ప్రమాదానికి గురై మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పాస్టర్ మృతి కేసును సీబీఐకు అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.