AP: సీఎం చంద్రబాబు బిగ్ షాక్ తగలనుంది. అమరావతి రాజధాని విస్తరణలో భాగంగా కొత్తగా 44 వేల ఎకరాలు సేకరించాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై, ఆయా మండలాల్లోని రైతులు వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ జీవనాధారమైన భూమి కోల్పోవడానికి సిద్ధంగా లేమని, అవసరమైతే హైకోర్టుకు వెళ్లడానికైనా సిద్ధమే అన్నట్లు చర్చ జరుగుతోంది. అదే జరిగితే భూ సేకరణలో ఇబ్బందులు తప్పేలా లేవని సమాచారం.