ముంబై వాంఖడే స్టేడియంలోని స్టాండ్స్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు పెట్టనున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) తాజాగా ప్రకటించింది. MCA వార్షిక సర్వసభ్య సమావేశంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. దివేచా పెవిలియన్ లెవల్ 3ని 'రోహిత్ శర్మ స్టాండ్' గా పేరు మార్చనున్నారు. రోహిత్‌తో పాటు BCCI మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, దిగ్గజ బ్యాట్స్‌మన్ అజిత్ వాడేకర్ పేర్లు కూడా స్టాండ్స్‌కు పెట్టాలని నిర్ణయించారు.