AP ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబు జనాన్ని నమ్మించి నట్టేట ముంచారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా రూ.1500 ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3000 భృతి ఇస్తామని చెప్పి పంగనామాలు పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ ఊసే లేదు. డ్వాక్రా మహిళలకు ఇస్తామన్న రుణాల హామీ ప్రస్తావనే తేలేదు. రైతులకూ అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు' అని ఆమె ఆరోపించారు.