శబరి నది ఉగ్రరూపం.. 250 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

52చూసినవారు
అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో వరద బీభత్సం సృష్టిస్తుంది. చింతూరు వద్ద శబరి నది ఉగ్రరూపం దాల్చింది. 45 అడుగుల మేర శబరి నది ప్రవహిస్తుంది. కూనవరం శబరి, గోదావరి సంగమం వద్ద 52 అడుగులకు వరద నీరు చేరింది. జాతీయ రహదారులు 30, 326 పైకి వరద నీరు చేరుతోంది. ఆంధ్ర నుంచి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 250 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వరదల బీభత్సంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్