ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.