జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఇచ్చే భారీ డిస్కౌంట్లు, డైన్ ఇన్ కార్యకలాపాలకు అవి ఆఫర్ చేస్తున్న పేమెంట్ గేట్ వే టూల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని రెస్టారెంట్లకు ద నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) హెచ్చరికలు చేసింది. ఇతర సర్వీసులకు సంబంధం లేకుండా చెల్లింపు గేట్ వే సేవలను అందించిన పక్షంలో మాత్రమే, రెస్టారెంట్లు ఆయా యాప్ పేమెంట్ల ప్లాట్ ఫామ్స్‌ను వినియోగించుకోవాలని తెలిపింది.