ఘోర ప్రమాదం.. డ్రైవర్, క్లీనర్ స్పాట్‌డెడ్ (వీడియో)

56చూసినవారు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్