సజ్జలపై షర్మిల సంచలన కామెంట్స్

588చూసినవారు
సజ్జలపై షర్మిల సంచలన కామెంట్స్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల మాట్లాడుతూ.. ‘సజ్జల నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నాడు. వైఎస్సార్ బిడ్డను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? అధికార మదం తలకెక్కిందా? మతి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు, నీ కొడుకు పేమెంట్ తీసుకొని నన్ను, సునీతను నానా రకాలుగా హింసించారు. నోరు ఉందని ఏదిపడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు.’ అని వార్నింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్