మాజీ సీఎం జగన్‌కు మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేశ్ వైసీపీని వీడనున్నారు. ఇప్పటికే ఈ విషయం గణేశ్ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలు బయటకు చెబుతానని జక్కంపూడి గణేశ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడుతారో అని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.