ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను CSK మాజీ సారథి ఎంఎస్ ధోనీ సమర్థించాడు. ఈ రూల్ వచ్చిన కొత్తలో తనకు అస్సలు నచ్చలేదని, ఇది అవసరం లేదని అనిపించిందని పేర్కొన్నాడు. ఈ రూల్‌ని IPL 2023 సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ నియమం వల్ల అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్‌ను తీసుకుంటూ జట్లు ప్రయోజనం పొందుతున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల భారీ స్కోర్లు నమోదు కావడం లేదని, ఆటగాళ్ల మైండ్ సెట్ మారడంతోనే ఇది సాధ్యమవుతోందని ధోనీ పేర్కొన్నాడు.