ఏపీలో నేరాల నియంత్రణకు రాష్ట్ర పోలీసులు డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాల ఇద్దరు వ్యక్తులు మద్యం తాగుతుండగా వారిని డ్రోన్ కెమెరాలు గుర్తించాయి. దీంతో వాటిని చూసి ఆ ఇద్దరు పరుగులు తీశారు. ఈ వీడియోను మంత్రి లోకేష్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. 'సారీ గాయ్స్.. నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. ఎందుకంటే మీరు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ దొరికిపోయారు’ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు.