నెల్లూరు జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారిని(ఆర్డిఓ) కే. మధులత తమ సిబ్బందితో కలిసి విజయవాడ వద్ద వరద సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారము, మందులు ఇతర వస్తువులు పంపిణీ చేసే విభాగంలో హెలికాప్టర్ సిబ్బందితో సూచనలు చేస్తూ సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన పలు శాఖల అధికారులు విజయవాడకు చేరుకుని సహాయక చర్యలలో నిమగ్నమయ్యారు.