నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వెంకట్రావు పల్లి ఎస్టీ కాలనీ సమీపంలో పేకాట స్థాపురంపై పోలీసులు ఆదివారం మెరుపు దాడులు చేశారు. ఈ దాడులలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లు, రూ. 26, 750 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ గంగాధర్ రావు మాట్లాడుతూ వారిపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు. పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.