కందుకూరి ఎమ్మెల్యే ఇంటిరి నాగేశ్వరరావు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. పూర్తిగా నీట మునిగిన ప్రాంతాలను సందర్శించి వీలైనంత త్వరగా నీటిని తోడాలని అధికారులకు సూచించారు. జలదిగ్బంధం వల్ల కొన్ని డివిజన్లలో ప్రజలు ఎవరూ బయటికి రాలేకపోతున్నారని దానికి తోడు మరో పక్క వర్షం పడుతుందని అధికారులు, పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.