అల్లూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకం ద్వారా గర్భిణీలకు ఉచితంగా పౌష్టికాహారం, ఐరన్ సిరప్ లను పంపిణీ చేశారు. కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కుమార్తె దీప్తి రెడ్డి సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొడ్ల విజయమ్మ, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.