నెల్లూరు: కాలువ కట్టలపై నివాసముండే పేదలకు అండగా నిలవాలి

70చూసినవారు
నెల్లూరు: కాలువ కట్టలపై నివాసముండే పేదలకు అండగా నిలవాలి
నగరంలో కాలువ కట్టలపై నివాసం ఉన్న పేదలకు అండగా నిలవాలని సిపిఎం నెల్లూరు నగర 25వ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆదివారం బాలాజీ నగర్లో ప్రారంభమైన ఈ మహాసభలో పలు తీర్మానాలను ఆమోదించారు. పొదుపు మహిళల సమస్యలు, నిరుద్యోగం, మద్యం షాపులను ఎత్తివేయడం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడం వంటి అంశాలను తీర్మానించారు. నగర పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్