నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇటీవల నాలుగైదు తుఫాన్లు రావడంతో చెరువులు, కుంటలు, బావులు నిండడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆ కొన్ని రోజులు పాటు చల్లని వాతావరణం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. అయితే ఇటీవల కొన్ని రోజుల నుంచి విపరీతంగా ఎండలు కాస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. తెల్లవారుజామున చలి, మధ్యాహ్నం సమయంలో ఎండలతో ఇబ్బందులు తప్పడం లేదు.