హోటళ్లును తనిఖీ చేసిన కమిషనర్

63చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని పలు హోటళ్లు, డాబాలను బుధవారం కమిషనర్ రమణ బాబు తనిఖీ చేశారు. ఈ మేరకు పలు డాబాల్లో కుళ్లిపోయిన చికెన్, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన కూరలను గుర్తించారు. వాటిని పంచాయతీ వాహనములో తరలించారు. ప్రజలకు కుళ్ళిన ఆహారాన్ని పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్