ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో పాటు నిన్న కురిసిన వర్షానికి ఉదయగిరి కొండపై అద్భుత జలపాతం ఆవిష్కృతమైంది. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతంగా ఉదయగిరి ఎంతో ప్రసిద్ధ చెందింది. ఇక్కడ ఎన్నో ఆలయాలు, కోటల ఉన్నాయి. గతంలోనూ వర్షం పడిన ప్రతిసారి ఇలా జలపాతం ఆవిష్కృతం అయ్యింది. ఇలాంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్న ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది గట్టిగా వినిపిస్తున్న మాట.