నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. భార్య కాకర్ల ప్రవీణ, మరదలు కాకర్ల సురేఖ, పలువురు కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.