నెల్లూరు జిల్లా వరికుంటపాడు లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. తొలుత స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించిన అర్చకులు అభిషేకాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు గురుపౌర్ణమి యొక్క విశిష్టతను భక్తులకు తెలియజేశారు.