మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గము లోని వింజమూరు మండల కేంద్రములో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పేద ప్రజల ఆకలిని తీరుస్తుంది. ఈరోజు (419వ రోజు) అన్న క్యాంటీన్ ద్వారా 430మంది పేద ప్రజలు తమ ఆకలిని తీర్చుకున్నారు. కాగా ఎమ్మెల్యే కాక ముందు నుంచి కాకర్ల సురేష్ ఈ ట్రస్ట్ నిరంతరాయంగా నడుపుతున్నారు.