పంటల బీమా రైతులకు రక్షణ కవచంలా ఉంటుందని, బీమాపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురంలోని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో క్రాప్ ఇన్సూరెన్స్ పై జిల్లాస్థాయి పర్య వేక్షణ కమిటీ (డీఎల్ఎంసీ) సమావేశాన్ని నిర్వహించారు. పంటల బీమా పథకం, రబీ 2024- 25, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.