అనంతపురం: 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

59చూసినవారు
అనంతపురం: 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
అనంతపురం జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. అనంతపురం జిల్లాలో 135 కేంద్రాల్లో 32,803 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు బాగా రాయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్