అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సిపిఎం
అనంతపురం జిల్లాలో ఖరీఫ్ లో అతివృష్టి, అనావృష్టితో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అనంతపురంలో బుధవారం డిమాండ్ చేశారు. జిల్లాలో ఏడు మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించడంపై జిల్లా ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని కోరారు.