వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమ కుటుంబాలు బాగుపడతాయని వడ్డెర సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం ధర్మవరం ఎన్జీవో కార్యాలయంలో ధర్మవరం మండలం వడ్డెర సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మవరం పట్టణానికి చెందిన వడ్డెర సంఘం నాయకుడు పల్లపు శివశంకర్ మాట్లాడుతూ వేరే రాష్ట్రాల్లో వడ్డెరలు ఎస్సీ ఎస్టీలుగా ఉంటే మన రాష్ట్రంలో బీసీ ఏ కేటగిరిలో ఉండడంతో వెనకబడి ఉన్నామన్నారు.