వినాయక చవితి పండగ సందర్భంగా ధర్మవరంలో ట్రాఫిక్ నిబంధనలు విధించినట్లు సీఐ నాగేంద్రప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండగ రద్దీ దృష్ట్యా ధర్మవరం టీఆర్టీ స్ట్రీట్ నుంచి అంజనం సర్కిల్ వరకు గురువారం సాయంత్రం నుంచి 7వ తేదీ వరకు వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రజలు దీనిని గుర్తించి ఇతర మార్గాల గుండా వెళ్లాల్సిందిగా సూచించారు.