భారత ప్రభుత్వం అందించే 'శిల్ప గురు' జాతీయ అవార్డుకు ఎంపికైన ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం అభినందించారు. కళలను కాపాడుకుంటూ, శ్రీ కృష్ణ చరిత, విశ్వరూప హనుమాన్ వంటి కళాఖండాలను రూపొందించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఇలాంటి వారి స్ఫూర్తితో యువత ప్రాచీన కళలను కాపాడుకునే చొరవ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.