గుంతకల్లు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా సీఐ ఏపీ మస్తాన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టూ టౌన్ పోలీస్ సిబ్బంది సీఐకి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఐ ఏపీ మస్తాన్ మాట్లాడుతూ. గుంతకల్లు పట్టణంలో ప్రజలు జూదం, మట్కా, వంటి అసాంఘిక కార్యక్రమాలు పాలుపడితే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. 24 గంటలు ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటానన్నారు.