గుత్తి పట్టణంలోని బండగేరిలో గురువారం గుంతకల్లు నియోజకవర్గ జనసేన బాధ్యుడు వాసగిరి మణికంఠ పర్యటించారు. వార్డులో గడపగడపకు తిరుగుతూ సమస్యల గురించి ఆరా తీశారు. పలువురు మహిళలు వార్డులో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని తాగునీటి సమస్యను పరిష్కరించాలని జనసేన నాయకులకు విన్నవించారు. త్వరలోనే కాలనీకి తాగునీటి సమస్యను తీరుస్తామని వారు హామీ ఇచ్చారు.