గుత్తి మండలం లచ్చానపల్లి వంక నుంచి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తుండగా గురువారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుని సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న గుత్తి చెందిన వినోద్ కుమార్, రవి అనే వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.